ఆంధ్రప్రదేశ్ కు అరుదైన గౌరవం.. మరోసారి స్టార్ హోదా

ఈ సర్వేలో ఏపీ మినహా మరేఇతర దక్షిణాది రాష్ట్రాలు టాప్ 5 లో స్థానం సంపాదించలేకపోయాయి. సచివాలయ వ్యవస్థతో గ్రామీణాభివృద్ధిలో

Update: 2022-03-10 08:30 GMT

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. వరుసగా రెండోసారి సుపరిపాలనలో ఏపీ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండటం గర్వించదగిన విషయం. ఈ సర్వేలో ఏపీ మినహా మరేఇతర దక్షిణాది రాష్ట్రాలు టాప్ 5 లో స్థానం సంపాదించలేకపోయాయి. సచివాలయ వ్యవస్థతో గ్రామీణాభివృద్ధిలో, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, బిల్లు ద్వారా మహిళలకు పూర్తి శాంతి భద్రతలు కల్పించడం, జిల్లా పరిపాలన విభాగం ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని 'స్కోచ్' పేర్కొంది.

ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా.. రెండోస్థానంలో పశ్చిమబెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, నాల్గవ స్థానంలో గుజరాత్, ఐదవ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.ఇక 7,8,9,10,11,12 స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, బిహార్, హరియాణా రాష్ట్రాలున్నాయి.




Tags:    

Similar News