ఆదిత్యకు మంత్రి పదవి?

మరికాసేపట్లో మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వర్లీ నుంచి [more]

Update: 2019-12-30 06:13 GMT

మరికాసేపట్లో మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వర్లీ నుంచి గెలిచిన ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి ఇవ్వాలని ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు ఒంటిగంటకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. శివసేన నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 15 మంది, ఎన్సీపీ నుంచి 16 మంది మంత్రి వర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎం పదవిని శరద్ పవార్ ఎవరికివ్వనున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Tags:    

Similar News