పాజిటివ్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించం

పరీక్షలపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాజిటివ్ [more]

Update: 2021-05-01 00:48 GMT

పరీక్షలపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాజిటివ్ ఉన్న వాళ్లకు పరీక్షలు నిర్వహించబోమని ఆదిమూలపు సురేష్ తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కేబినెట్ వాయిదా పడటానికి, పరీక్షలకు లింకు పెట్టడం లోకేష్ కు తగదన్నారు ఆదిమూలపు సురేష్. కేబినెట్ వివిధ కారణాల వల్ల వాయిదా పడిందని చెప్పారు.

Tags:    

Similar News