తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం

అక్టోబర్ నెలాఖరుకు వచ్చినా ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపలేదు. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో..

Update: 2023-10-30 04:00 GMT

అక్టోబర్ నెలాఖరుకు వచ్చినా ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపలేదు. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో.. ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నా ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. అయితే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను ప్రభావమే కారణమని చెబుతున్నారు విశ్లేషకులు. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత దేశమంతా విస్తరించి అక్టోబర్‌లో వెళ్లిపోతాయి. నైరుతి వెళ్లిన కొద్ది రోజులకే ఈశాన్య రుతుపవనాలు పలకరిస్తాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా ప్రభావం చూపిస్తాయి.

పెరిగిన చలి తీవ్రత:

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగ మంచు చాలా చోట్ల కనిపిస్తోంది. ఏపీలో కూడా.. వింత వాతావరణం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు అలముకుంటోంది. శీతల గాలులతో చలి తీవ్రత కనిపిస్తోంది. ఆ తర్వాత పొడి వాతావరణం, ఎండ ఉంటోంది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉన్నాయి. మరింత విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం లేదు. దీనికి తోడు హమున్ తుఫాను బంగ్లాదేశ్ వైపునకు వెళ్ళిపోయింది. అయితే తుపాన్లు తీరానికి దూరంగా సముద్రంలో ఉన్నప్పుడు.. భూభాగంపై ఉన్న తేమనంతటిని తమ వైపు లాక్కుంటాయి. దీంతో పొడి వాతావరణం, ఎండ ఉంటుంది. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి.. తెల్లవారుజామున ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు కనిపిస్తుంది. ఆ తర్వాత ఎండ కాస్తుంది. అయితే ఈశాన్య రుతుపవనాలు సెట్ అయ్యేవరకు ఈ పరిస్థితి తప్పదంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

Tags:    

Similar News