కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ

కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ చేరనుంది

Update: 2026-02-14 12:30 GMT

కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ చేరనుంది. ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కల్వకుంట్ల కవిత మద్దతుతో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన ఎనిమిది మంది ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు.

ముఖ్యమంత్రి సమక్షంలో
దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయితే వడ్డేపల్లి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఫార్వార్డ్ బ్లాక్ లు పోటీ చేసినప్పటికీ అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. పది స్థానాలున్న ఈ మున్సిపాలిటీలో ఎనిమిది గెలవడంతో ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమవుతుంది.


Tags:    

Similar News