Revanth Reddy : బాసరలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. ఆలయ అధికారులు, పూజారులు రేవంత్ రెడ్డికి వేదమంత్రాల మధ్య స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
సరస్వతి ఆలయంలో...
రూ.225 కోట్ల రూపాయలతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు ముందుగానే చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను వేగంగా చేయాలని, గోదావరి పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.