Telangana : నేడు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి

నేడు ములుగు జిల్లా కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు

Update: 2026-04-07 04:02 GMT

నేడు ములుగు జిల్లా కర్రెగుట్టల్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. ఆపరేషన్ కగార్ ముగిసిన నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి కర్రెగుట్టల్లో పర్యటించనున్నారు. నేడు కర్రెగుట్టలకు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రహదారి ప్రారంభించనున్నారు.

పలు కార్యక్రమాల్లో...
వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో పర్యటించనున్న డీజీపీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఏర్పాటు చేసిన పామునూరు పోలీస్ బేస్ క్యాంప్‌ ను డీజీపీ శివధర రెడ్డి పరిశీలిస్తారు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. డీజీపీ పర్యటనకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News