Revanth Reddy : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నేడు పిప్పిరిలో బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సభ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
బాసరలో పర్యటించనున్న...
అలాగే నేడు బాసరలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావరి పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించనున్నారు.