BJP : నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు
నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి.
నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జెండా ఎగరవేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న...
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలును జరుపుకోవాలని రాంచందర్ రావు కోరారు. కార్యకర్తలు తమ ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒక పండగలా నిర్వహించాలని పిలుపు నివ్వడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఈ వేడుకలను నిర్వహిస్తుంది.