మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు

Update: 2026-04-06 04:20 GMT

తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. పోలీసుల ఎదుట మల్లాతో పాటు30మంది మావోయిస్టులు లొంగిపోయారు. AK-47తో పాటూ భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గణపతి మాత్రం...
లొంగుబాటును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ కగార్ సమయం ముగిసిన తర్వాత కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే కీలక నేత గణపతి మాత్రం ఇంకా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోకపోవడంతో ఇప్పటికే పోలీసులు చర్చలు జరుపుతున్నారని తెలిసింది.


Tags:    

Similar News