నేడు గజ్వేల్‌లో బంద్ కొనసాగుతుంది. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ లోని ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ నేతల దాడికి నిరసనగా బంద్ ను బీఆర్ఎస్ నేతలు నిర్వహిస్తున్నారు.పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి...
రెండు రోజుల క్రితం గజ్వేల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసి ముఖ్యమంత్రి ఫొటోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యారు.