Telangana : నేడు తెలంగాణకు అమిత్ షా
నేడు తెలంగాణకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ను ప్రారంభించనున్నారు
నేడు తెలంగాణకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రానున్నారు. ఈరోజు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరకుంటారు. అక్కడి నుంచి 1.45గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి నిజామాబాద్ కు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి వినాయక్ నగర్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుని దానిని ప్రారంభించనున్నారు.
కిసాన్ మహా సభలో పాల్గొని..
మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అరగంట సేపు బోర్డు కార్యాలయంలోనే ఉంటారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజమాబాద్ లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 2.45 గంటల నుంచి నాలుగు గంటల వరకూ పాలిటిక్నిక్ గ్రౌండ్స్ లోజరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.ఐదు గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.