తెలంగాణ వ్యక్తి కిబ్రిటన్ పార్లమెంటులో అరుదైన గౌరవం

తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు బ్రిటన్ పార్లమెంటులో జీవితకాల సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2026-02-12 07:04 GMT

బ్రిటిష్‌ పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణకు చెందిన వ్యక్తి జీవిత కాల సభ్యుడిగా మారారు. బ్రిటీష్ పార్లమెంటులో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. లేబర్ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఉదయ్ నాగరాజును జీవిత కాల సభ్యుడిగా ఎన్నుకున్నారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు జీవితకాల సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జీవిత కాల సభ్యుడిగా...
సంప్రదాయ ఎరుపు గౌను ధరించి, భగవద్గీతపై ప్రమాణం చేశారు. సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఆయన ఇరవై ఐదేళ్లుగా బ్రిటన్‌లో సేవలందిస్తున్నారు. లేబర్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజును ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సిఫార్సుతో కింగ్‌ చార్లెస్‌-3 లైఫ్‌ పీర్‌గా నియమించారు. ఇకపై ఆయనను ‘లార్డ్‌ నాగరాజు ఆఫ్‌ బ్లూమ్స్‌బరీ’గా పిలుస్తారు.


Tags:    

Similar News