నేడు జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్

నేడు జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు

Update: 2026-04-09 03:11 GMT

జగిత్యాల జిల్లా రాజకీయాల్లోనేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నేడు జీవన్‌రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్‌లోకి జీవన్‌రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నారు. కేటీఆర్‌తోపాటు జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న బీఆర్ఎస్‌ నేతలు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ కూడా వెళ్ల నున్నారు. ఇటీవల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

చేరిక వేదిక.. తేదీని...
మధ్యాహ్నం రెండు గంటలకు జీవన్ రెడ్డి, కేటీఆర్ కీలక భేటీ జరగనుంది. ఇప్పటికే జీవన్‌రెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరికపై చర్చించనున్నారు. వేదిక, తేదీ ని కూడా ఈ సమావేశంలో ఖరారయ్యే అవకాశముంది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.


Tags:    

Similar News