అప్పు చెల్లించలేదని.. చెట్టుకు కట్టేసి
అప్పు తీర్చలేదని అంగన్ వాడీ టీచర్‌ను చెట్టుకు ఫైనాన్స్ చేసిన వాళ్లు కట్టేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని అంగన్ వాడీ టీచర్‌ను చెట్టుకు ఫైనాన్స్ చేసిన వాళ్లు కట్టేశారు. కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అప్పు చెల్లించలేదని అంగన్ వాడీ టీచర్‌ను ఫైనాన్సర్లు చెట్టుకు కట్టేసి అవమానించారు.
పోలీసుల విచారణ...
సుమారు గంట పాటు హింసించిన ఈ ఘటన మంగళవారం జరగగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా అవమానించిన ఫైనాన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.