జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసింది

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నా

Update: 2026-04-09 07:34 GMT

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. అనేక సార్లు పదవులు ఇచ్చిందని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దానిని తప్పుపట్టడమేంటని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

అనేక పదవులు ఇచ్చి...
రేవంత్ పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్‌రెడ్డి ఎవరు? అని మహేశ్ గౌడ్ నిలదీశారు. కేసీఆర్ అవినీతిని అనేకసార్లు జీవన్‌రెడ్డి విమర్శించారని మహేశ్ గౌడ్ గుర్తు చేశారు. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.















Tags:    

Similar News