Breaking : గద్వాల్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురి మృతి
గద్వాల్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మరణించారు
గద్వాల్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మరణించారు. గద్వాల్ నియోజకవర్గంలోని అయిజపురంలోని భూంపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పార్వతమ్మ, సర్వేష్,సౌభ్యాగ్య పిడుగుపాటుతో మరణించనిట్లు గ్రామస్థులు తెలిపారు. పిడుగు పాటు సంభవించి మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని ఆ ప్రాంత వాసులు తెలిపారు.
పొలం పనులు చేసుకుంటుండగా...
పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పడటంతో ఇద్దరు మహిళలు, ఒక యవకుడు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాతావరణ శాఖ పిడుగులు పడే అవకాశముందని, పొలాలకు వెళ్లిన వారు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండవద్దని పదే పదే సూచనలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రాణాలు పిడుగుపాలవుతున్నాయి.