Kavitha : నేను పోటీ చేసేది అక్కడే : కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. తన మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట అని రెండో ప్రాధాన్యత బోధన్ నియోజకవర్గాలని కవిత తెలిపారు. వచ్చే వారం పార్టీని ప్రకటిస్తానని కవిత తెలిపారు. ఎన్నికల కమిషన్ వద్ద ప్రాసెస్ లో ఉందని కవిత తెలిపారు. తనతో పాటు తన పార్టీ నుంచి ఎన్నికల బరిలో నేతలు ఉండరున్నారని కవిత అన్నారు.
గతంలో ఎర్రవెల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి...
గతంలో మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లేవారని, ఇప్పుడు ఢిల్లీ వెళుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను మానేసి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసమే రెండు ప్రభుత్వాలు పనిచేశాయని కవిత తెలిపారు. తన పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో తాను చెప్పలేనని, అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని కవిత తెలిపారు.