Telangana : తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది

Update: 2026-02-19 02:09 GMT

తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున గద్వాల జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఈరోజు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళుతున్నఆర్టీసీ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది.

ఇరవై మందికి గాయాలు...
ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఎవరు లేరు కానీ తీవ్ర ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకున్నట్లయింది. అనేక మందికి కాళ్లు, చేతులు విరిగాయి. వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News