స్పీకర్ విచారణకు నేడు కడియం

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-02-19 05:13 GMT

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగుతుంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది.

ఎనిమిది మంది...
ఇప్పటి వరకూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎనిమిది మంది పార్టీ మారినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది. నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్‌ విచారణ జరుగుతుంది. స్పీకర్ ఎదుట విచారణకు నేడు కడియం శ్రీహరి హాజరుకానున్నారు


Tags:    

Similar News