తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు
తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ చేశారు
తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ చేశారు. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి న్యాయస్థానాల్లో బాంబులు పెట్టామని, 12.05 గంటలకు బాంబుతో పేల్చి వేస్తామని ఆగంతకులు మెయిల్ చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై మూడు న్యాయస్థానాల్లో న్యాయవాదులను, కక్షిదారులను బయటకు పంపారు.
మెయిల్ రావడంతో...
విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబులువ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆగంతకుడు మెయిల్స్ ఎక్కడి నుంచి పెట్టారు? ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు ఈ మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. గాలింపు చర్యల తర్వాత తిరిగి న్యాయస్థానాలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.