Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 26వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు ఇప్పటికే ఆర్థిక శాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 వ తేదీన ఉభయ సభల ను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు.
28న బడ్జెట్...
అనంతరం సభ వాయిదా పడుతుంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.