BRS : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2026-02-18 12:30 GMT

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాతనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్ తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడకు వస్తున్న మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి లో బాల్క సుమన్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

జడ్జి ఎదుట హాజరు
నిన్నక్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో పాటు తమ పార్టీకి చెందిన మహిళ కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడులు చేశారని ఆరోపిస్తూ నేడు క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ఎదుట హాజరు పర్చారు.


Tags:    

Similar News