ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి హైకమాండ్ పిలుపు
ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది
ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లలేదు. హైదరాబాద్ వరకు వెళ్లి తిరిగి జగిత్యాలకు వచ్చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాను ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని భావించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీ ఫాం కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని మీడియా జీవన్ రెడ్డి ముందు చెప్పుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలలో...
తాను పార్టీని వీడే సమయం దగ్గరపడిందనిచెప్పుకొచ్చారు. దీంతో ఢిల్లీకి రావాలని మంగళవారం ఉదయం ఫోన్ కేసీ వేణుగోపాల్ నుంచి రావడంతో జగిత్యాల నుండి హుటాహుటిన బయల్దేరి ఏమైందో ఉన్నట్లుండి హైదరాబాద్ వరకు వెళ్లి మనసు మార్చుకొని తిరిగి జగిత్యాలకు తిరిగి జీవన్ రెడ్డి వచ్చేశారు. తాను వెళ్లినా సముదాయింపులు, బుజ్జగింపులు తప్ప మరేదీ ఉండదని భావించి వెనక్కు తిరిగారని తెలిసింది.