Telangana : తొమ్మిది మున్సిపాలిటీల్లో హంగ్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది.

Update: 2026-02-13 07:24 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఎవరికీ మెజారిటీకి తగిన స్థానాలు రాకపోవడంతో ఇక్కడ స్వతంత్రులతో పాటు కో -ఆప్షన్ సభ్యుల ఓటింగ్ కీలకంగా మారనుంది. కే సముద్రం, జహీరాబాద్, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం మున్సిపాలిటీల్లో ఎవరికీ మెజారిటీ స్థానాలు రావడం లేదు.

బేరసారాలకు దిగే...
దీంతో ఇక్కడ వార్డు సభ్యుల బేరసారాలకు ఎక్కువ అవకాశముంటుందని అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యారు. తమ పార్టీ తరుపున గెలిచిన అభ్యర్థులు బీ ఫారాలు తీసుకున్న వెంటనే క్యాంప్ లకు తరలిస్తున్నారు. హంగ్ మున్సిపాలిటీలున్న చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారనుంది. మరి ఈ హంగ్ ఉన్న చోట్ల ఎవరు అధికారంలోకి వస్తారన్నది 16వ తేదీన తేలనుంది.


Tags:    

Similar News