Telangana : తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది
తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 24 విడుదల చేసి, ఈ మందు తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కూరగాయలపైన...
పారాక్వాట్ గడ్డిమందు తక్కువ మోతాదులో ఉపయోగించినా శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని, కూరగాయల విషపూరితంగా మారుతాయని, వాతావరణంపై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ గడ్డిమందుపై నిషేధం విధించింది