Breaking : మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి.. పోలీసులు లాఠీఛార్జి
Breaking : మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి.. పోలీసులు లాఠీఛార్జి
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. రాళ్లదాడిలో మంత్రి వాహనం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ దాడిలో గాయాలయ్యాయి. కాంగ్రెస్ కు 9, బీఆర్ఎస్ కు 9 మంది కౌన్సిలర్ల బలం ఉంది. సీపీఐ ఒకరున్నారు. ఇప్పుడు సీపీఐ కౌన్సిలర్ ఎవరికి మద్దతిస్తారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.
అదుపు చేసేందుకు...
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ ఉద్రిక్తత తలెత్తింది. మున్సిపల్ సమావేశానికి బీఆర్ఎస్, సీపీఎం కౌన్సిలర్లు వస్తున్న సమయంలో పోలీసులు ఆపారు. వాహనాన్ని చెక్ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అదే సమయంలో మంత్రి వివేక్ వస్తుండటంతో ఆయన వాహనాలపై దాడులు చేశారు. ఈ దాడి వెనక బాల్కసుమన్ ఉన్నారని మంత్రి కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతోంది.