Telangana : ఆ ఐదు గ్రామాలు మా కివ్వండి : తుమ్మల
కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు
కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పాలనా సౌలభ్యం కోసం ఐదు గ్రామాలను భద్రాచలంలో కలపాలని కోరారు.
అమిత్ షాకు లేఖ...
ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తీరతాయని తుమ్మల నాగేశ్వరరావు అమిత్ షాకు రాసిన లేఖలో వివరించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే నిర్ణయం జరిగేలా చూడాలని కేంద్రమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. భద్రాచలానికి దగ్గరగా ఉన్న ఈ ఐదు గ్రామాల గిరిజన ప్రాంత ప్రజలు ఏపీ లో ఉండటంతో అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తుమ్మల తెలిపారు.