నేడు ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లనున్నారు.

Update: 2025-12-22 03:58 GMT

నేడు ఢిల్లీకి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లనున్నారు. నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారకు. రేపు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషితో భేటీ ఉత్తమ్ భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి వరిధాన్యం సేకరణపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు.

నీటి పారుదల ప్రాజెక్టుపై...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులపై తమ అభ్యంతరాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసే విషయంపైనా, అలాగే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల నీటి వాటాకు సంబంధించి విషయాలను కూడా మంత్రులతో చర్చించనున్నారు. న్యాయనిపుణులతో కూడా మాట్లాడి సుప్రీంకోర్టులో తెలంగాణ పిటీషన్ పై ఆరా తీయనున్నారు.


Tags:    

Similar News