నేడు ఆదిలాబాద్ జిల్లాలో ఒవైసీ
ఎంఐఐ అధినేత నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో ఎంఐఎం పోటీకి దిగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయి ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
అయితే నేడు నిర్మల్, భైంసాలలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే ప్రయోజనం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పట్టణాభివృద్ధికి తమ పార్టీ తోడ్పడుతుందని ఒవైసీ ప్రజలకు వివరించనున్నారు.