Telangana : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-02-05 08:08 GMT

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాప్యంతో నిలిచిపోయిన నిధులను విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమమయింది.

తొలి విడతగా...
మొత్తం రూ.3000 కోట్ల వరకు రాష్ట్రానికి రావాల్సి ఉండగా తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. తొలి విడత నిధులు విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే నిధులను విడుదల చేయలేదు. ఇటీవల ఎన్నికలు పూర్తి కావడంతో నేడు తొలి విడత నిధులను విడుదల చేసింది.


Tags:    

Similar News