Revanth Reddy : నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలను నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బర్దిపూర్ లో 687 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరనునున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ మున్సిపాలిటీల నుంచి ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరసగా జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.