అమెరికాలో కేటీఆర్.. ఎయిర్ పోర్టులోనే?
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయనకు లాస్ ఏంజెల్స్ లో ఘన స్వాగతం లభించింది
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయనకు లాస్ ఏంజెల్స్ లో ఘన స్వాగతం లభించింది. పార్టీ అభిమానులు, ఎన్ఆర్ఐలు కేటీఆర్ కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ కాసేపు సమావేశమయ్యారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించారు.
పెట్టుబడుల కోసం.....
తెలంగాణలో పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు. పది రోజుల పాటు ఆయన అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తెలంగాణలో అమలు పరుస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు సహకరించాలని కేటీఆర్ కోరారు.