మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అభిషేక్ సింగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసింది.అభిషేక్ సింగ్ డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు.
అభిషేక్ సింగ్ ను అదుపులోకి తీసుకుని...
నాలుగు బృందాలు అభిషేక్ సింగ్ కోసం గాలించాయి. చివరకు అదుపులోకి తీసుకున్నారు. శరత్ కుమార్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అన్న దానిపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. అభిషేక్ సింగ్ ను పలు కోణాల్లోనూ, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.