Weather Report : చల్లటి వాతావరణం.. ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2026-03-23 04:08 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మండు వేసవిలో వాతావరణ శాఖ కూల్ కబురు అందించింది. ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావంతో ఈ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల మాత్రం పొడి వాతావరణం నెలకొని ఉంటుందని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణం చల్లగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నేడు ఇక్కడ వానలు...
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వానలు పడుతున్నాయని చెప్పింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, రైతులు, పశువుల కాపర్లు పొలాలకు వెళ్లినప్పుడు చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల కింద నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో నేడు...
తెలంగాణలోనూ పలు చోట్ల వానలు పడే అవకాశముందని హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనూ వానలు పడతాయని చెప్పింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని వ్యవసాయ అధికారులు కోరారు.


Tags:    

Similar News