Breaking : దానం నాగేందర్ పార్టీ మార్పుపై హైకోర్టుకు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యే...
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా 2023లో బీఆర్ఎస్ బీఫారం తీసుకుని గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు మీద సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పది మంది పిటీషన్లపై విచారించిన స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటీషన్ పై ఎల్లుండి విచారణ చేయనుంది.