Revanth Reddy : సిద్ధిపేటలో నాయకత్వాన్ని మార్చండి.. మంత్రిని చేస్తాం : రేవంత్ రెడ్డి
సిద్ధిపేటలో మార్పు చేసి చూడాలని, మంచి జరుగుతుందో లేదో చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
సిద్ధిపేటలో మార్పు చేసి చూడాలని, మంచి జరుగుతుందో లేదో చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో మార్పు చూపించాలని అన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. 1984 నుంచి 2029 వరకూ సిద్ధిపేటలో కల్వకుంట్ల కుటుంబాన్నే గెలిపించారని, అయితే సిద్ధిపేటకు ఏం జరిగిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.2029 లో సిద్ధిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులకు ఆదాయం పెరగాలంటే వరి ఒక్కటే కాదని అన్నారు.
అడ్డం పడినా ఆగబోం...
ఎవరు అడ్డం పడినా ఆగబోమని రేవంత్ రెడ్డి తెలిపారు.చెట్టుకు పుట్టిన పురుగును ఎలా తొలగించాలో తమకు తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు. 45 రోజుల్లోనే 9వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి పనికి కాళ్లకు అడ్డం పడటమే వారికి తెలుసునని అన్నారు. అడ్డం పడితే ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి అన్నారు. పామాయిల్ సాగు రైతుకు లాభం చేకూరుతుందని తెలిపారు. ఆకు కూరలు, చిరు ధాన్యాలు, ఆయిల్ పామ్ పై దృష్టి పెట్టాలన్నారు. సిద్ధిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కట్టినట్లే కొడంగల్ లో కూడా కట్టాలని రవేంత్ రెడ్డి అన్నారు.
అందరికీ రైతు భరోసా...
రైతు భరోసా నిధులు అందరికీ అందుతాయని తెలిపారు. ఎకరాకు 3,560 కోట్లు నిధులు నేడు అందుతాయని చెప్పారు. రైతును రాజును చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పంటకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నిలా రైతుల కోసం 2,535 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, తమ ప్రభుత్వం రైతుల కోసం 5,355 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పత్తి సాగులోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. రైతులు పంట మార్పిడికి ప్రయత్నించాలన్నారు.