Telangana : నేడు కేబినెట్ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరడనుంది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈరోజు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే అవకాశముంది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 20 వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాల్లో...
అయితే నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలు 1 లో జరగనుది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగనుంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టే పలు బిల్లులపై కేబినెట్ చర్చించనుంది.