కేసీఆర్ పై కేటీఆర్ ట్వీట్.. ఆయనను వాళ్లు నమ్మరంటూ?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఏం చెప్పినా మొదట నమ్మరని, తర్వాత అదే నిజమవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Update: 2022-02-12 06:30 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఏం చెప్పినా మొదట నమ్మరని, తర్వాత అదే నిజమవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ 2001లో ఒక పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ట్విట్టర్ లో కేటీఆర్ షేర్ చేశారు. కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ కేంద్రానికి దారికితెస్తామని, తెలంగాణను సాధిస్తామని అన్న వ్యాఖ్యలను ప్రత్యర్థులు నమ్మలేదన్నారు. పైగా కేసీఆర్ కామెంట్స్ అవహేళన చేశారన్నారు.

అదే నిజమై....
తర్వాత కేసీఆర్ చెప్పిందే నిజమైందని కేటీఆర్ తెలిపారు. నాడు కేసీఆర్ చేసిన ప్రకటన నిజమవ్వడంతోపాటు ఆయన సారధ్యంలోనే ఇప్పుడు బంగారు తెలంగాణగా మారిపోతుందని కేటఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి వ్యాఖ్యలను కూడా జత చేశారు. మొదట మనల్ని పట్టించుకోరని, తర్వాత నవ్వుతారని, ఆ తర్వాత మనతో వాళ్లు పోరాడతారని, ఆ పోరాటంలో గెలుపు మనదేనంటూ గాంధీ చెప్పిన మాటలను ట్వీట్ చేశారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంతో మరోసారి యుద్ధానిక కేసీఆర్ దిగడంతో కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News