Telangana : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? అయితే మీరు ఈ పని చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-03-23 04:49 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఏప్రిల్‌లో రెండో విడత జాబితా కింద ఇళ్లను మంజూరు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ అందని వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారులకు వెళ్లాయి.

రెండో విడత కూడా...
ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత పూర్తి కానుండటంతో రెండో విడత కూడా వెంటనే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హులైన వారిని ఎంపిక చేసే విధానంలో కూడా కొన్ని మార్పులు చేసి ఈ రెండో విడత పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ వేసవిలోనే ఇళ్ల నిర్మాణాన్ని లబ్దిదారులు మొదలు పెట్టుకునే విధంగా ప్రభుత్వం వెంటనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇళ్ల నిర్మాణానికి...
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. నాలుగు విడతలుగా లబ్దిదారుల అకౌంట్లలో వీటిని జమ చేస్తోంది. బేస్ మెంట్ నుంచి వివిధ దశల్లో విడతల వారీగా నిధులను విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు. రెండో విడత కూడా అంతే మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.


Tags:    

Similar News