మీరే సుప్రీం..భవిష్యత్ మీదే : రాహుల్ గాంధీ

ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2026-03-02 11:52 GMT

ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు. భవిష్యత్ అంతా డీసీసీ అధ్యక్షులదేనని ఆయన తెలిపారు. వికారాబాద్ లో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాత్రం ప్రజలను మెప్పించి , మనసును గెలిచి అధికారంలోకి రావాలనే కోరుకుంటున్నది అని రాహుల్ గాంధీ అన్నారు. డీసీసీ అధ్యక్షులదే భవిష్యత్ ఉంటుందని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. పది రోజుల పాటు రెండు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ది మాత్రం గాంధీ విధానమని ఆయన తెలిపారు. ప్రతి పల్లెకు, పట్టణాలకు కాంగ్రెస్ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు.

తాను కూడా ఎదిగిన తీరు...
ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. తాను దశల వారీగా రాజకీయంగా ఎదిగి ఈ పదవిలోకి వచ్చానని తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టానని అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం గళం విప్పుతూ ప్రజల్లో ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.తాను ఏ పదవిలో ఉన్నా పైరవీ చేయలేదని చెప్పారు. తన పనివిధానం చూసిన తర్వాత మాత్రమే పదవులు వచ్చాయని ఆయన తెలిపారు. దేశంలో అనేక సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేశారని, వారికి అండగా నిలుస్తూ మనం కూడా అన్ని రకాలుగా మద్దతుగా నిలుద్దామని తెలిపారు.


Tags:    

Similar News