వనమా వెంకటేశ్వరరావు పై వేటు అనర్హత వేటు

2018 కొత్తగూడెం ఎన్నికలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు హైకోర్టును..

Update: 2023-07-25 07:28 GMT

vanama venkateswara rao

తెలంగాణ హైకోర్టు సంచలనమైన తీర్పును వెల్లడించింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై జరిమాన విధించడమే కాకుండా.. ఎమ్మెల్యేగా అర్హుడు కాదని ప్రకటిస్తూ సంచలమైన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు హైకోర్టు ప్రకటించింది. 2018 కొత్తగూడెం ఎన్నికలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని జలగం వెంకట్రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు హైకోర్టులో వాదప్రతివాదంలో కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ అనంతరం హైకోర్టు నేడు సంచలనమైన తీర్పును వెల్లడించింది.

హై కోర్ట్ వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడమే కాకుండా సమీప అభ్యర్థిగా జలగం వెంకట్రావును విజేతగా ప్రకటిస్తూ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. అంతేకాకుండా తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను వనమ వెంకటేశ్వరరావుకు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించడమే కాకుండా 2018 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అందుకు అర్హుడు కాదని ఎవ్వరూ ఊహించని రీతిలో హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో జలగం వెంకట్రావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


Tags:    

Similar News