BJP : నేడు కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, వెంకటేశ్వర నగనర్, నరసింహ బస్తీలో కమ్యునిటీ హాళ్లకు కిషన్ రెడ్డి శంకుస్థాపనలు చేయనుున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కిషన్ రెడ్డి సమావేశమవుతారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...
అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. స్థానిక నేతలతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.