Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-10-01 04:30 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూడు బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు సంబంధించి టెండర్లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీుకుంది. డిజైన్ ఏజన్సీ లను ఎంపిక చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈనెల 15వ తేదీ లోగా...
డిజైన్ల కోసం ఆసక్తిగల సంస్థలు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మూడు బ్యారేజీలకు సంబంధించి పునరుద్ధరించడానికి అవసరమైన డిజైన్ల తయారీకి ఆసక్తి గల సంస్థలు టెండర్లు దాఖలు చేయవచ్చని కోరింది.


Tags:    

Similar News