Telangana : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-06-14 06:39 GMT

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏను 3.64 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉతర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా, తాజా పెంపుతో అది 30.03 శాతానికి చేరింది.

డీఏ ను జూన్ నెల వేతనంతో కలిపి...
డీఏను జూన్ నెల వేతనంతో కలిపి జులై నెలలో చెల్లిస్తారు.. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి 2025 మే 31వ తేదీ వరకూ ఇవ్వాల్సిన డీఏ బకాయీలను చెల్లించనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పది శాతం డీఏ బకాయీలను ప్రాన్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 90 శాతం బకాయీలను 28 వాయిదాల్లో జులై నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags:    

Similar News