Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గుడ్ న్యూస్ అందబోతుంది

Update: 2025-05-25 08:07 GMT

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గుడ్ న్యూస్ అందబోతుంది. ప్రభుత్వం వచ్చే నెల రెండో తేదీ దీనిపై ప్రకనట చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏను విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందింది. పెండింగ్ లో ఉన్న డీఏలలో ఒకదానిని ఆరోజు విడుదల చేస్తాని చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన ప్రయోజనాలు కూడా అందించనున్నారు.

పదవీ విరమణ చేసిన వారికి...
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైలు ఉందని కూడా చెప్పారు. ఆ ఫైల్ ను ముఖ్యమంత్రి క్లియర్ చేసే అవకాశముందని చెబుతున్నారు. దీనివల్ల పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు బకాయీలు పూర్తిగా వచ్చే నెలలో అందుతాయని ఆశతో ఉన్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు అందిండచం ద్వారా వారికి కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వం చూస్తుంది.


Tags:    

Similar News