Telangana : ఈ ఏడాది తెలంగాణలో పండగ సెలవులివే
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి నెలలోనే నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను మార్చి నెలలోనే నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోపుగా అంటే జనవరి పదోతేదీ నాటికి టెన్త్ సిలబస్ ను పూర్తి చేయాలని చెప్పింది. సిలబస్ ను ఈలోపుగా పూర్తి చేసి విద్యార్థులను టెన్త్ పరీక్షలకు సిద్ధం చేయాలని కోరింది.
మార్చిలోనే టెన్త్ పరీక్షలు...
ఈ ఏడాదికి సంబంధించిన క్యాలెండర్ ను విద్యాశాఖ విడుదల చేస్తూ ఈ మేరకు పదో తరగతి పరీక్షలను మార్చి నెలలోనే నిర్వహించాలని డిసైడ్ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమయి ఏప్రిల్ 23వ తేదీ వరకూ నడుస్తాయని, మొత్తం 230 పనిదినాల్లో పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది. దీంతో పాటు సెప్టంబరు 21 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకూ దసరా సెలవులు, డిసెంబరు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 15వ తేదీ వరకూ ఉంటాయని విద్యాశాఖ క్యాలెండర్ లో ప్రకటించింది.