Telangana : నేడు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు.. అగ్రనేతల అత్యవసర సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రానికి నేతలంతా ఢిల్లీ చేరుకోవాలని అధినాయకత్వం ఆదేశించింది. రేపు ఉదయం పది గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశమవుతారు. ముంబయి నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీకి నేటి సాయంత్రానికి చేరుకుంటారు.
ఏఐసీసీ నేతలతో భేటీ...
ఢిల్లీలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంలో పాలన, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే మంత్రుల మధ్య సమన్వయ లోపంతో పాటు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.