Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో సమీక్షించనున్నారు.

Update: 2025-09-15 02:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలో సమీక్షించనున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమకు కొంత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశముంది.

వాయిదా వేయాలని...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో దీనిపై తిరిగి కోర్టుకు వెళ్లాలని యోచిస్తుంది.


Tags:    

Similar News