Telangana : నేడు కొడంగల్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రపంచలో ఆయన పర్యటన సాగనుంది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఈ గ్రామం నుంచి ఈ పథకాలను ప్రారంభించనున్నారు.
నాలుగు పథకాలను...
లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన వారికి ఆరువేల నగదును జమ చేయనున్నారు. ఆత్మీయ రైతుభరోసా పథకం కింద ఆరువేల రూపాయలు వ్యవసాయ కూలీల ఖాతాలో వేయనున్నారు. సొంత జాగా ఉన్న పేదలకు తొలి విడతగా ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయనున్నారు.